కొనసాగుతున్న కోవిడ్ మరణాలు.. తాజాగా మరో 139 మంది మృతి
- మొత్తం 1662కు చేరిన కోవిడ్ మృతుల సంఖ్య
- వైరస్ నుంచి బయటపడిన 9465 మంది
- కొత్తగా 1843 మంది వైరస్
కోవిడ్-19 మరణ మృదంగం కొనసాగుతోంది. తాజాగా, చైనాలో ఈ వైరస్ మరో 139 మంది ప్రాణాలను బలిగొంది. మృతులందరూ హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. వీరి మృతితో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1662కు చేరింది. కాగా, కొత్తగా మరో 1843 మందికి ఈ వైరస్ సోకింది. ఇక, దేశవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 69 వేలకు చేరింది. అయితే, 9465 మంది కోవిడ్ నుంచి బయటపడడం ఊరటనిచ్చే అంశం. చైనా సహా ఇతర ఆసియా దేశాల్లోనూ కోవిడ్ శరవేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కాగా, సింగపూర్‌లో తాజాగా మరో ఐదుగురికి ఈ వైరస్ సోకడంతో ఆ దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 72కు చేరింది.