మలయాళ సాహిత్యంలో ‘టాప్’ లేపిన బీహార్ యువతి

  • ఆరేళ్ల క్రితం బీహార్ నుంచి కేరళకు వలసొచ్చిన యువతి
  • జ్యూస్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబ పోషణ
  • వందశాతం మార్కులతో ‘టాప్‌’
బీహార్ నుంచి కేరళకు వలసొచ్చిన ఓ యువతి మలయాళ సాహిత్యంలో టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అత్యంత కఠినమైనదిగా పేరుగాంచిన మలయాళ సాహిత్యంలో వందశాతం మార్కులతో టాపర్‌గా నిలిచి రికార్డులకెక్కింది. రోమియా కతూర్ అనే 26 ఏళ్ల యువతి తన భర్త సైఫుల్లాతో కలిసి ఆరేళ్ల క్రితం కేరళకు వలస వచ్చి కొట్టాయం జిల్లాలోని ఉమయనల్లూరులో స్థిరపడింది. వీరికి ముగ్గురు పిల్లలు కాగా, జ్యూస్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కేరళ సాహిత్య ప్రాధికార సంస్థ ఇటీవల వలస కార్మికుల కోసం సాహిత్యంలో పరీక్ష నిర్వహించింది. రెండు దశల్లో పరీక్షలు నిర్వహించగా మొత్తం 3700 మంది హాజరయ్యారు. వీలో రోమియా కతూర్ వందశాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.


More Telugu News