ఉసేన్ బోల్ట్ తో తనను పోల్చడంపై తొలిసారి స్పందించిన 'కంబళ' వీరుడు శ్రీనివాస గౌడ!

  • ఉసేన్ బోల్ట్ ఓ వరల్డ్ స్టార్
  • నేను కేవలం బురదలో మాత్రమే పరిగెత్తాను
  • వెల్లడించిన శ్రీనివాస గౌడ
శ్రీనివాస గౌడ... కర్ణాటకకు చెందిన ఈ యువకుడి పేరు గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మంగళూరు సమీపంలోని కాద్రిలో సంప్రదాయ 'కంబళ' పోటీలు జరుగగా, 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్ల వ్యవధిలో పశువులను పరిగెత్తిస్తూ, తానూ పరిగెత్తాడు. అంటే, సాధారణ 100 మీటర్ల పరుగును శ్రీనివాస గౌడ 9.53 సెకన్లలోనే దాటేసినట్టు. ఇది జమైకన్ స్టార్ ఉసేన్ బోల్ట్ స్థాపించిన వరల్డ్ రికార్డు 9.58 సెకన్ల కన్నా తక్కువ.

రాత్రికి రాత్రే శ్రీనివాస గౌడ స్టార్ గా మారగా, అతన్ని నిపుణులైన సాయ్ కోచ్ లు పరిశీలిస్తారని, అతనిలోని టాలెంట్ ను గుర్తించే ఏర్పాట్లు చేశామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. తనకు వచ్చిన పేరుపై తొలిసారి స్పందించిన శ్రీనివాస గౌడ, "ప్రజలు నన్ను ఉసేన్ బోల్ట్ తో పోలుస్తున్నారు. ఆయన వరల్డ్ చాంపియన్. నేను కేవలం బురదలో మాత్రమే పరిగెత్తాను" అని చెప్పాడు. శ్రీనివాస గౌడ, ఉత్త కాళ్లతో బురదలో పరిగెత్తడం, వీడియో వైరల్ కావడంతో అతని ఫిజిక్ ను చూసిన ఎంతో మంది ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించారు.


More Telugu News