యెమెన్‌లో సౌదీ దళాల వైమానిక దాడులు.. 31 మంది మృతి
- సౌదీ జెట్‌ను కూల్చివేసినట్టు ప్రకటించిన హౌతీ తిరుగుబాటుదారులు
- ప్రతీకార దాడులకు దిగిన సౌదీ దళాలు
- మరో 12 మందికి గాయాలు
యెమెన్‌పై సౌదీ దళాలు జరిపిన దాడిలో 31 మంది పౌరులు మృతి చెందారు. యెమెన్ ఉత్తర ప్రావిన్సులోని అల్ జాఫ్ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. సౌదీ నేతృత్వంలోని దళాలు జెట్ విమానాన్ని కూల్చేశాయి. అంతకుముందు రోజు సౌదీ జెట్ విమానం ఒకటి కూలిపోయింది. దీనిని తామే కూల్చేసినట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో సౌదీ ఈ ప్రతీకార దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 31 మంది పౌరులు మృతి చెందారని, మరో 12 మంది గాయపడ్డారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. అయితే, సౌదీ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.