బాలయ్యతో ఆ సీన్ చేయించకుండా వుంటే బాగుండేది: దర్శకుడు బి.గోపాల్

బాలయ్యతో ఆ సీన్ చేయించకుండా వుంటే బాగుండేది: దర్శకుడు బి.గోపాల్
  • బాలకృష్ణకి హిట్స్ ఇచ్చిన బి.గోపాల్
  • పరాజయంపాలైన 'పల్నాటి బ్రహ్మనాయుడు'
  • ఇప్పటికీ బాధపడుతున్నానన్న గోపాల్  
దర్శకుడు బి.గోపాల్ అనగానే లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో ఆయన తెరకెక్కించిన చిత్రాలు గుర్తొస్తాయి. అవి సాధించిన విజయాలు కళ్లముందు కదలాడతాయి. ముఖ్యంగా బాలకృష్ణకి ఆయన భారీ విజయాలను అందించారు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' మాత్రం పరాజయాన్ని చవిచూసింది.

కథాకథనాల సంగతి అటుంచితే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు విడ్డూరంగా అనిపించడంతో ప్రేక్షకులు నవ్వుకున్నారు. ఆ విషయాలను గురించి తాజా ఇంటర్వ్యూలో బి.గోపాల్ ప్రస్తావించారు. "ఈ సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. బాలయ్య తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ ను చేయాల్సింది కాదు. ఆ సీన్ వలన చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సీన్ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. అందుకు ఇప్పటికీ బాధపడుతూనే వున్నాను" అని చెప్పుకొచ్చారు.


More Telugu News