మంత్రి తలసానికి జరిమానా విధించిన జీహెచ్ఎంసీ అధికారులు

  • అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ఫైన్
  • నిబంధనలు ఉల్లంఘించారంటున్న అధికారులు
  • రూ.5 వేలు చెల్లించాలంటూ మంత్రికి నోటీసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించే ఎవరినీ జీహెచ్ఎంసీ అధికారులు వదిలిపెట్టడంలేదు. తాజాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా కొన్నిచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ అధికారులు మంత్రికి ఫైన్ వేశారు. రూ.5 వేలు చెల్లించాలంటూ తలసానికి నోటీసులు పంపారు.

అటు, మంత్రి తలసాని ఇవాళ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు. ఎల్లుండి సీఎం కేసీఆర్ బర్త్ డే కావడంతో జలవిహార్ లో వేడుకలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ బాల్యం నుంచి ఇప్పటివరకు ఆయన ప్రస్థానాన్ని ఫొటోల రూపంలో ప్రదర్శిస్తామని తలసాని తెలిపారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 


More Telugu News