నాకు పదవులు ముఖ్యం కాదు, అవసరమైతే రాజీనామా చేస్తా: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
- సీఏఏ, ఎన్ఆర్సీలపై కడపలో ముస్లింల ఆందోళన
- మద్దతు తెలిపేందుకు వెళ్లిన అంజాద్ బాషాకు నిరసన సెగ
- సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానానికి యత్నిస్తానన్న బాషా
జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో సీఏఏ, ఎన్ఆర్సీ లను వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు ఈరోజు ఆయన కడప వెళ్లారు. అయితే, సీఏఏను, ఎన్ ఆర్సీని ఎందుకు వ్యతిరేకించడం లేదని ఆయన్ని ప్రశ్నించిన ఆందోళనకారులు, ‘గో బ్యాక్’ అంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అంజాద్ బాషా స్పందిస్తూ, సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టేందుకు ప్రయత్నిస్తానని వారికి చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీ అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, అవసరమైతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.