జపాన్ విహారనౌకలో మరో భారతీయుడికి కరోనా వైరస్

  • జపాన్ లోనూ ఉనికి చాటుకుంటున్న కరోనా వైరస్
  • కరోనా భయంతో డైమండ్ ప్రిన్సెస్ విహారనౌక నిలిపివేత
  • నౌకలోని 285 మందికి కరోనా సోకినట్టు గుర్తింపు
  • కరోనా సోకిన భారతీయుల పరిస్థితి నిలకడగానే ఉందన్న దౌత్య వర్గాలు
చైనాలో ఉద్ధృతంగా ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ జపాన్ లోనూ ఉనికిని ప్రదర్శిస్తోంది. మూడు వేల మంది ప్రయాణికులతో యోకహామా రేవులో నిలిచిపోయిన జపాన్ విహారనౌక డైమండ్ ప్రిన్సెస్ లో కూడా కరోనా ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ నౌకలోని ప్రయాణికుల్లో 285 మందిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు.

ఇప్పటికే ఈ నౌకలోని ఇద్దరు భారతీయులకు కూడా కరోనా సోకగా, తాజాగా మరో భారత జాతీయుడు కూడా ఈ మహమ్మారి బారినపడ్డాడు. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా ప్రభావిత ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ముగ్గురు భారతీయుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జపాన్ లోని భారత రాయబార వర్గాలు వెల్లడించాయి.


More Telugu News