ముంబయిలో ఉన్నది నా ఇల్లు కాదు: అల్లు అర్జున్

  • ముంబయిలో తనకు సొంత ఇల్లేమీ లేదని వెల్లడి
  • అది గీతా ఆర్ట్స్ గెస్ట్ హౌస్ అని స్పష్టీకరణ
  • త్వరలోనే ముంబయిలో ఇల్లు కొంటానంటూ వ్యాఖ్యలు
అల... వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో హీరో అల్లు అర్జున్ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాడు. అదే ఊపులో ఓ నేషనల్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన గురించి జరుగుతున్న ఓ ప్రచారంపై స్పష్టతనిచ్చాడు.

ముంబయిలో తనకు ఇల్లు ఉందని చాలా మంది భావిస్తుంటారని, వాస్తవానికి ముంబయిలో తనకు సొంత ఇల్లు లేదని స్పష్టం చేశాడు. ముంబయిలో ఉన్నది గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థకు చెందిన గెస్ట్ హౌస్ అని, తాను ఎప్పుడన్నా ముంబయి వెళితే ఆ గెస్ట్ హౌస్ లోనే బస చేస్తానని వెల్లడించాడు. తనకు ముంబయిలో ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉందని మనసులో మాట చెప్పాడు. తనకు ముంబయి నగరం అంటే ఎంతో ఇష్టం అని, ఎక్కువసార్లు వస్తుంటానని తెలిపాడు.


More Telugu News