పాటల కోసం గోవా వెళ్లనున్న చిరూ చిన్నల్లుడు

  • కల్యాణ్ దేవ్ రెండో సినిమాగా 'సూపర్ మచ్చి'
  • కథానాయికగా రచితా రామ్ పరిచయం 
  • వేసవిలో విడుదల చేసే ఆలోచన
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ 'విజేత' సినిమా ద్వారా తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడలేదుగానీ, లుక్స్ పరంగా .. నటన పరంగా ఆయన పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ .. పులివాసు దర్శకత్వంలో 'సూపర్ మచ్చి' సినిమా చేస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా ద్వారా కథానాయికగా రచితా రామ్ పరిచయమవుతోంది.

ఈ సినిమా టాకీ పార్టుతో పాటు మూడు పాటల చిత్రీకరణను కూడా పూర్తి చేసుకుంది. మిగతా రెండు పాటలను గోవాలో చిత్రీకరించనున్నారు. అందుకోసం ఈ సినిమా టీమ్ వచ్చేనెలలో గోవా వెళ్లనుంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. క్యాచీ టైటిల్ తో వస్తున్న కల్యాణ్ దేవ్ ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.


More Telugu News