ఏపీలో తొమ్మిది నెలల్లోనే లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కిపోవడం బాధాకరం: చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వ పాలనా తీరుతో రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోంది
- రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు తరలిపోతున్నారు
- యువత ఉద్యోగావకాశాలను కోల్పోతోంది
వైసీపీ ప్రభుత్వ పాలనా తీరుతో రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. అంతేకాకుండా, రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు తరలిపోతున్నారని, యువత ఉద్యోగావకాశాలను కోల్పోతోందని మండిపడ్డారు. వైసీపీ తొమ్మిది నెలల పాలనలో లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోవడం బాధాకరమంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.
వైసీపీ తొమ్మిది నెలల పాలనపై ఇటీవల దావోస్ లో కూడా పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. గత ఏడాది (2018-19) అత్యధిక పెట్టుబడులు (11.8%) ఆకర్షించి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని అన్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లలో (2014-19) దేశ వ్యాప్తంగా రూ 7,03,103 కోట్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపీకి రూ.70 వేల కోట్లు వచ్చాయని, అందుకు ఆర్బీఐ తాజా బులెటిన్ వివరాలే ప్రత్యక్ష సాక్ష్యమంటూ ఓ పత్రికలో వెలువడ్డ ఓ కథనాన్ని పోస్ట్ చేశారు.