మాకు ఎటువంటి సమాచారం లేదు: ఎన్డీయేలో వైసీపీ చేరికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా

  • టీడీపీకి, వైసీపీకీ సమాన దూరం
  • మొదటి నుంచి ఇది మా పార్టీ విధానం
  • మోదీ, అమిత్‌షాతో జగన్‌ చర్చలు పాలనా సంబంధమైనవే
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయి చర్చించిన అంశాలు పాలనాపరమైనవే అయి ఉండవచ్చునని, అంతకు మించి ఏమీ ఉండదన్నది తన అభిప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

ఈరోజు ఆయన ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరుతోందన్న అంశంపై రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలకు సమాన దూరం పాటించాలన్నది తమ పార్టీ విధానమని, అందువల్ల ఇటువంటి వన్నీ ఊహాగానాలేనని ఆయన తేల్చిపారేశారు. రాష్ట్రంలో విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.


More Telugu News