చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడి మృతి
- మెగాస్టార్ తొలిచిత్రం డైరెక్టర్ రాజ్‌కుమార్ కన్నుమూత
- పునాదిరాళ్లు సినిమాలో చిరుకు అవకాశం ఇచ్చిన రాజ్
- గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో సతమతం
మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితానికి తొలిమెట్టుగా నిలబడిన దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన పెద్ద కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత భార్య కూడా కాలం చేసింది. వరుస సంఘటనలతో మానసికంగా రాజ్‌కుమార్ బాగా కుంగిపోయారు.
రాజ్‌కుమార్ అనారోగ్యంతో సతమతమవుతున్నారని తెలుసుకున్న చిరంజీవి ఇటీవల అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కూడా చేయించారు. ఆర్థిక సాయం అందించారు. రాజ్‌కుమార్ దర్శకత్వం వహించిన తొలి సినిమా పునాదిరాళ్లు. ఈ సినిమాలో ఓ పాత్రకోసం చిరంజీవిని ఆయన ఎంపిక చేశారు. ఆ విధంగా చిరింజీవి ఆశల శిఖరానికి పునాది రాయి వేశారు.
ఆ కృతజ్ఞతతోనే చిరంజీవి ఆయనకు చాలాసార్లు ఆర్థికంగా సాయపడ్డారు. తొలి సినిమానే అయినా తన దర్శక ప్రతిభతో రాజ్‌కుమార్ ఐదు నంది అవార్డులు అందుకున్నారు. రాజ్‌కుమార్ స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని చిన్నకొడుకు నిర్ణయించారు.