కేరళలో ఐదో తరగతి బాలుడి 'ఫుట్ బాల్ జీరో డిగ్రీ గోల్'... వీడియో ఇదిగో!

  • కేరళలో కిడ్స్ ఫుట్ బాల్ పోటీలు
  • కార్నర్ షాట్ ను గోల్ గా మలచిన చిన్నోడు
  • వైరల్ అవుతున్న వీడియో
ఫుట్ బాల్ లో జీరో డిగ్రీ గోల్... కార్నర్ షాట్ ను తీసుకుని, బల్ ను తన్ని, దాన్ని నేరుగా గోల్ లోకి పంపడం. ఫుట్ బాల్ ఆటగాళ్లందరికీ, జీరో డిగ్రీ గోల్ ను సాధించాలన్నది ఓ డ్రీమ్ అని చెబుతుంటారు. అటువంటి డ్రీమ్ ను అత్యంత సునాయాసంగా సాధించాడో ఐదో తరగతి కుర్రాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

కేరళలో జరిగిన కిడ్స్ ఫుట్ బాల్ పోటీల్లో భాగంగా దనిశ్ అనే కుర్రాడు ఈ ఫీట్ ను సాధించాడు. అతను కిక్ కొడుతున్న వీడియోను మ్యాచ్ చూస్తున్న ఒకతను వీడియో తీయగా, అదిప్పుడు వైరల్ అయింది. తన కుమారుడు గోల్ కొడుతున్న వీడియోను తీస్తారని, అది ఇంతగా వైరల్ అవుతుందని ఎంతమాత్రమూ అనుకోలేదని దనిశ్ తల్లి వ్యాఖ్యానించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News