ఈ ఏడాది అమరనాథుడిని దర్శించుకోవాలా?... అయితే ఇది మీ కోసమే!
- స్వయంభువుగా వెలిసే మంచు లింగం
- జూన్ 23 నుంచి, 42 రోజుల పాటు యాత్ర
- ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హిమాలయ పర్వత సాణువుల్లో ప్రతి సంవత్సరమూ స్వయంభువుగా వెలిసే మంచు శివలింగం అమరనాథుడిని దర్శించుకోవాలని భావిస్తున్నారా? ఈ సంవత్సరం జూన్ 23 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న జేఅండ్ కే బ్యాంకుల్లో దరఖాస్తులను నింపి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అత్యంత ప్రయాసతో కూడే ఈ యాత్రలో యాత్రికులు, జమ్మూ, పహల్గాం, బల్తాల్ పట్టణాల మీదుగా అమర్ నాథ్ గుహను చేరుకుంటారు. ఈ యాత్ర చేయాలని భావించే వారు డబ్బుతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగివుండాలి. యాత్రపై ఏ క్షణమైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడవచ్చు. అయితే, యాత్రకు వెళ్లే వారికి భారత సైన్యం పూర్తి రక్షణను కల్పిస్తుంది. ఈ సంవత్సరం 42 రోజుల పాటు కొనసాగనున్న అమర్ నాథ్ యాత్ర, ఆగస్టు 3న ముగుస్తుంది.