హీరో స్ప్లెండర్ ప్లస్ బీఎస్-6 మోడల్ ఎలా ఉందో చూడండి!

  • పాత మోడళ్లను బీఎస్-6 ప్రమాణాలతో ఆధునికీకరిస్తున్న హీరో
  • సరికొత్త హంగులతో స్ల్పెండర్ ప్లస్
  • ప్రారంభ ధర రూ.59,600
దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన మోడళ్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరిస్తోంది. తాజాగా, బీఎస్-6 ప్రమాణాలతో సరికొత్తగా ముస్తాబు చేసిన హీరో స్ల్పెండర్ ప్లస్ మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ నుంచి బీఎస్-4 వాహనాలు విక్రయించడం కుదరదన్న సంగతి తెలిసిందే. కాగా, కొత్త హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ ప్రారంభ ధర రూ.59,600 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. హీరో ద్విచక్రవాహనాలు పోర్ట్ ఫోలియోలో ఎక్కువ అమ్ముడయ్యే మోడల్ స్ల్పెండర్ ప్లస్. స్ల్పెండర్ ప్లస్ తో పాటు డెస్టినీ 125 (రూ.64,310), మ్యాస్ట్రో ఎడ్జ్ 125 (రూ.67,950) బీఎస్-6 మోడళ్లను కూడా హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి తీసుకువచ్చింది.


More Telugu News