కరోనా ఎఫెక్ట్: చైనాలో పెంపుడు జంతువులకూ మాస్కులు.. వైరల్ అవుతున్న ఫొటోలు
- సర్జికల్ మాస్కులకు రంధ్రాలు చేసి కడుతున్న తీరు
- చైనాలో ఉన్న ఆందోళనకర పరిస్థితికి అద్దం పడుతోందంటున్న నిపుణులు
- వైబోలో వీడియోలు, ఫొటోలు వైరల్
చైనాలో కరోనా వైరస్ భయం మరింతగా పెరిగిపోతోంది. చాలా మంది తమ పెంపుడు కుక్కలు, పిల్లులు వంటి జంతువులకు కూడా మాస్కులు కట్టి తీసుకెళ్తున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం వైబో (Weibo)లో దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మనం పెట్టుకునే సర్జికల్ మాస్కులను ఆ పెంపుడు జంతువులకు సరిపోయేలా మార్చుతున్నారు. వాటి కళ్లు ఉండే చోట రంధ్రాలు చేసి కడుతున్నారు. ఇది వినడానికి సరదాగా ఉన్నా.. చైనాలో జనం పడుతున్న ఆందోళనకు ఇది అద్దం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.