రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం: కేటీఆర్
- నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ సదస్సులో కేటీఆర్
- భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై వ్యాఖ్యలు
- ఐటీ కంపెనీలు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించాలి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముంబైలో నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ ఫోరం-2020 సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాలకు స్వేచ్ఛతోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమని స్పష్టం చేశారు. రెండు, మూడేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, కేంద్రం ఒప్పుకోకపోయినా ఆర్థిక గణాంకాలు అదే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు కేంద్రం మరింత స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియా నినాదం ఇప్పుడు అసెంబ్లింగ్ ఇన్ ఇండియాగా మారిందని అన్నారు. ఐటీ కంపెనీలు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.