టీమిండియాకు గాయాల బెడదపై కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు
- గాయాలతో తప్పుకున్న ప్రధాన ఆటగాళ్లు
- రోహిత్ శర్మ, ఇషాంత్, భువీకి గాయాలు
- యువ ఆటగాళ్లకు మంచి అవకాశం అని శాస్త్రి వెల్లడి
సొంతగడ్డపై న్యూజిలాండ్ ఎప్పుడూ బలమైన ప్రత్యర్థే. అది కూడా టెస్టుల్లో అయితే ఇక చెప్పేదేముంది! ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా మరికొన్నిరోజుల్లో టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే, రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం మేనేజ్ మెంట్ ను కలవరానికి గురిచేస్తోంది. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ గాయాల కారణంగా తప్పుకున్నారు. దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం లోటుగానే భావిస్తున్నామని తెలిపారు.
ఇషాంత్ శర్మ జట్టులో ఉంటే ఇతర ఆటగాళ్లపై పెద్దగా భారం పడదని, న్యూజిలాండ్ లో ఫాస్ట్ పిచ్ లపై భువనేశ్వర్ అన్ని ఫార్మాట్లలో ఉపయోగపడేవాడని వివరించాడు. రోహిత్ శర్మదీ ఇదే పరిస్థితి అని, దురదృష్టవశాత్తు గాయపడి టెస్టు సిరీస్ కు దూరమయ్యాడని శాస్త్రి విచారం వ్యక్తం చేశాడు. అయితే, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా వంటి ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. గిల్, షాల్లో ఒకరు మయాంక్ అగర్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తారని వివరించారు.