అక్రమాస్తుల కేసులో జగన్‌కు శిక్ష పడడం ఖాయం: బుచ్చయ్య చౌదరి
- కేసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించట్లేదు?
- పదవులతో సంబంధం లేకుండా విచారణకు సహకరించాలి కదా?
- సీబీఐ అధికారులను మార్చాలని అడగడం ఎంత దౌర్భాగ్యం
- వివేకా హత్య కేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారు?
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శిక్ష పడడం ఖాయమని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. పదవులతో సంబంధం లేకుండా విచారణకు సహకరించాలి కదా? అని అన్నారు.
సీబీఐ అధికారులను మార్చాలని అడగడం ఎంతటి దౌర్భాగ్యం అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టారని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి లెక్కలు చూపించారా? అని నిలదీశారు.