రూ.43 వేల కోట్లు జగన్ గారు కొట్టేసినట్టు తేలింది.. వారిద్దరి శేష జీవితం జైల్లోనే: బుద్ధా వెంకన్న
- విచారణ పూర్తయితే రూ.20 లక్షల కోట్లు దొరుకుతాయి
- వర్సిటీల్లో జగన్ గారి అవినీతి చరిత్రని కేస్ స్టడీలుగా చెబుతున్నారు
- ఐటీ రైడ్స్ గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం కామెడీగా ఉంది
ఐటీ దాడుల నేపథ్యంలో వైసీపీ నేతలు తమ పార్టీపై చేస్తోన్న ఆరోపణలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 'ప్రాథమిక విచారణలోనే 43 వేల కోట్లు జగన్ గారు కొట్టేసినట్టు తేలింది. విచారణ పూర్తయితే ముఖ్యమంత్రిగా చేస్తున్న అవినీతితో కలిపి 20 లక్షల కోట్లు దొరుకుతాయి. విజయసాయిరెడ్డి గారి శేష జీవితం జగన్ గారితో కలిసి జైలు ఊచలు లెక్కపెట్టడమే' అని పేర్కొన్నారు.
'జగన్ అవినీతి సామ్రాజ్యం, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్, క్విడ్ ప్రో కో లాంటి అంశాల గురించి తెలుసుకొని ప్రపంచ కార్పొరేట్ సంస్థలే ఆశ్చర్యపోయాయి. ప్రపంచంలోని పెద్ద యూనివర్సిటీల్లో జగన్ గారి అవినీతి చరిత్రని కేస్ స్టడీలుగా చెబుతున్నారు' అని బుద్ధా వెంకన్న అన్నారు.
'ఘోరమైన అక్రమాలకు పాల్పడి ఐఏఎస్ అధికారులను సైతం జైలుకి తీసుకెళ్లిన దరిద్రమైన చరిత్ర ఉన్న జగన్ గారు, విజయసాయిరెడ్డి గారు ఐటీ రైడ్స్ గురించి మాట్లాడటం, నీతులు వల్లించడం చాలా కామెడీగా ఉంది' అని అన్నారు.