మళ్లీ కట్టెల పొయ్యే గతి... విశాఖలో సీపీఐ వినూత్న నిరసన!
- గ్యాస్ ధర పెంపుపై ఆగ్రహం
- గత కొన్నాళ్లుగా విద్యుత్ చార్జీల పెంపుపైనా ధర్నాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజం
చరిత్ర వెనక్కి వెళ్తుందంటే ఇలా మళ్లీ కట్టె పొయ్యిల వద్దకు వెళ్తుందనుకోలేదంటూ గ్యాస్ ధర పెంపుపై ఈరోజు ఉదయం సీపీఐ విశాఖ నగరంలో వినూత్నంగా నిరసన తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రెండురోజుల క్రితం గ్యాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముందు ఆర్టీసీ చార్జీలు, ఆ తర్వాత విద్యుత్ చార్జీలు, తాజాగా గ్యాస్ ధరలు...ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని అన్నట్లు వరుసగా ధరలు పెంచుతూ సామాన్యుడి నెత్తిపై భారాన్ని వేస్తుండడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రెండు రోజుల నుంచి నగరంలో భారీగా నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపడుతోంది.
ఈరోజు ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో ఏకంగా రోడ్డుపైనే కట్టెల పొయ్యి ఏర్పాటుచేసి దానిపై పాలు కాస్తూ ‘ఈ ప్రభుత్వాల హయాంలో భవిష్యత్తు ఇదే’ అంటూ నినాదాలు చేసి ఆకట్టుకుంది. గ్యాస్ సిలెండర్లను తాళ్లతో బంధించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తక్షణం పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.