రాజకీయ 'అపరిచితులు' వీళ్లు అంటూ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్‌

  • చంద్రబాబుగారి హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు
  • ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారు
  • బాబు గారి హయాంలో 9,56,263 ఉద్యోగాలు వచ్చాయన్నారు
  • అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారు 
రాజకీయ 'అపరిచితులు' వీళ్లు అంటూ టీడీపీ నేత నారా లోకేశ్‌ ఓ వీడియోను పోస్ట్ చేశారు. వైసీపీ నేతలు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చేస్తోన్న వ్యాఖ్యలను అందులో వినిపించి తీవ్ర విమర్శలు చేశారు.

'చంద్రబాబు గారి హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్యాల యాత్ర చేసిన జగన్ గారు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బాబు గారి హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారు' అని ట్వీట్ చేశారు.

'పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెప్పింది' అని అన్నారు.

'ఇవన్నీ వైకాపాలా కార్యకర్తలకు దొడ్డి దారిలో ఇచ్చిన ఉద్యోగాలు కావు. నిరుద్యోగ యువతకి బాబు ఇచ్చిన జాబులు' అని అన్నారు.
 
'ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్  ప్రమోషన్ పాలసీ పేరుతో వైకాపా ప్రభుత్వం రూపొందించిన పాలసీలో టీడీపీ హయాంలో 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.51 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉత్పత్తి రంగంలోనే వచ్చినట్టు ప్రకటించారు' అని తెలిపారు.


More Telugu News