టిక్ టాక్ లో పరిచయం... ఓయో రూమ్స్ లో ఏకాంతం!
- ప్రేమకు దారితీసిన పరిచయం
- వివాహానికి ససేమిరా అన్న యువకుడు
- పోలీసుల ఎదుటే యువతి ఆత్మహత్యాయత్నం
ఇటీవల హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు తన కేసును పరిష్కరించడంలో అలసత్వాన్ని చూపిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసుల ఎదుటే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువతి కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈ కేసులో కారు డ్రైవర్ గా పని చేస్తున్న వీరబాబు (21) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, టిక్ టాక్ యాప్ ద్వారా బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన ఓ యువతితో (22) వీరబాబుకు పరిచయం ఏర్పడింది. ఒకరి వీడియోలు ఒకరు లైక్ చేసుకుంటూ, కామెంట్లు పెట్టుకుంటూ దగ్గరైన వీరు, ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. మాదాపూర్ లోని ఓయో రూమ్స్ కు కలిసి వెళ్లి ఏకాంతంగా గడిపారు. ఆపై తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరితే, వీరబాబు మొహం చాటేశాడు. దీనిపై గత వారంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా, వీరబాబును పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
ఆపై తనకు న్యాయం జరగలేదని భావించిన ఆమె, మరోసారి స్టేషన్ కు వెళ్లి, వీరబాబుతో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేసింది. వీరబాబును పోలీసులు మరోసారి పిలిపించగా, వివాహం చేసుకునేందుకు ససేమిరా అన్నాడు. దీంతో ముందుగానే తాను తెచ్చుకున్న బ్లేడ్ తో బాధితురాలు గొంతు కోసుకుంది. రక్తం కారుతుండగా, ఆమెను పోలీసులే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యువతిని మోసం చేశాడని వీరబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.