వరుణ్ మోటార్స్ లో అవకతవకలు... ఏకకాలంలో సోదాలతో కలకలం!

  • టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండానే డెలివరీ
  • 300 వాహనాలను అమ్మారని తేల్చిన రవాణా శాఖ
  • లాగిన్ ను సస్పెండ్ చేసిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వాహనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చైన్ గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ మోటార్స్ లో పలు అవకతవకలు జరిగినట్టు రవాణా శాఖ తేల్చింది. విజయవాడ, విజయనగరం, భీమవరం, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఉన్న వరుణ్ మోటార్స్ లో నిన్న ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు, దాదాపు 300కు పైగా వాహనాలను తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా డెలివరీ ఇచ్చారని తేల్చింది.

ఇదే సమయంలో సంస్థ మరిన్ని ప్రాంతాల్లో సబ్ డీలర్లను నయమించుకుని వారితో వాహనాలను విక్రయిస్తోందని కూడా వెల్లడైంది. ఇక అక్రమాలు నిజమని తేలిన నేపథ్యంలో, వరుణ్ మోటార్స్ నిర్వహిస్తున్న గ్రూప్ షోరూముల్లో కార్ల విక్రయాలు జరుగకుండా, సంస్థ లాగిన్ ను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఇక్కడ జరిగిన అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తున్నామని, ఆపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, వరుణ్ మోటార్స్ సంస్థ మారుతి సుజుకి వాహనాలను విక్రయిస్తుందన్న సంగతి తెలిసిందే. 


More Telugu News