నా బోయ్ ఫ్రెండ్ మోసగాడు.. ఎంతో మంది మహిళలను మోసగించాడు: సినీ నటి సనాఖాన్

  • మెల్విన్ ను గుడ్డిగా నమ్మాను
  • అతను మోసగాడని తెలుసుకున్నాను
  • మాకు పిల్లలు పుడితే వారికి ఏం నేర్పుతాడు?
తన బోయ్ ఫ్రెండ్ పెద్ద మోసగాడని సినీ నటి సనాఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎంతో మంది మహిళలను మోసగించాడని చెప్పింది. కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో సనాఖాన్ చాలా కాలం డేటింగ్ చేసింది. తాజాగా వీరిద్దరూ విడిపోయారు. ఈ సందర్భంగా సనాఖాన్ మాట్లాడుతూ, మెల్విన్ ను తాను గుడ్డిగా నమ్మానని, కానీ అతను మోసగాడని తెలుసుకున్నానని చెప్పింది. నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని తెలిపింది. తనను పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని మెల్విన్ కోరుకున్నాడని... కానీ, మోసగాడైన అతనికి పిల్లలు పుడితే వాళ్లకు ఏం నేర్పుతాడని ప్రశ్నించింది.



More Telugu News