నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ పర్యావరణవేత్త ఆర్‌కే పచౌరీ కన్నుమూత
- గతేడాది జులైలో గుండెపోటు
- హృద్రోగ సమస్యలతో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స
- ఆయన సారథ్యంలోని ఐరాస ఐపీసీసీకి నోబెల్ బహుమతి
ప్రముఖ పర్యావరణవేత్త ఆర్‌కే పచౌరీ (79) గురువారం కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (తేరి) వ్యవస్థాపక అధ్యక్షుడైన పచౌరీ ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి చైర్మన్‌గా కూడా పనిచేశారు. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. గతేడాది జులైలో గుండెపోటుకు గురైన ఆయనకు ఇదే ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయింది.
పచౌరీ నేతృత్వంలోని ఐపీసీసీ నోబెల్ బహుమతి అందుకుంది. మానవ నిర్మిత వాతావరణ మార్పునకు సంబంధించిన అవగాహన పెంపొందించడానికి, వ్యాప్తి చేయడానికి, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలకు విశేష కృషి చేసిందుకుగాను ఈ అవార్డు లభించింది. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ తర్వాత తేరి డైరెక్టర్ పదవీ బాధ్యతల నుంచి పచౌరీ తప్పుకున్నారు.