ఢిల్లీ ఓటమిపై కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర నిరాశ

  • పార్టీ ఫలితాలు నిరాశ కలిగించాయి
  • పార్టీ ఆలోచనా విధానం మారాల్సి ఉంది
  • కొత్త భావజాలం పెంపొందించుకోవాలి
ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓటమి పాలు కావడంపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా పృథ్వీపూర్‌లో నిన్న పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయన్నారు. పార్టీ ఆలోచనా విధానం మారాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొత్త తరానికి తగ్గట్టుగా తమ భావజాలం మారాల్సి ఉందన్నారు. దేశం మారిందని, అందుకు తగ్గట్టుగానే సరికొత్త ఆలోచనలతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సింధియా పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ ఎనిమిది స్థానాలు సాధించగా, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.



More Telugu News