కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా పోరాడాల్సి ఉంది: ప్రియాంకా గాంధీ
- జనం ఏం చేసినా సరిగానే చేస్తారు
- ఇక ముందు కూడా పోరాడుతాం
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వెల్లడి
కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా పోరాడాల్సి ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు.
‘‘ప్రజలు ఏం చేసినా కరెక్టుగానే చేస్తారు. కానీ మాకు ఇది పోరాడాల్సిన సమయం. మేం ఇంకా చాలా పోరాడాల్సి ఉంది. పోరాడుతాం (జనతా జో కర్తీ హై, సహీ కర్తీ హై. లెకిన్ హమారే లియే సంఘర్ష్ కా సమయ్ హై, హమే బహుత్ సంఘర్ష్ కర్నా హై, ఔర్ హమ్ కరేంగే..)’’ అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
ఢిల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవని విషయం తెలిసిందే. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లలోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు.