‘గోలీ మారో’ వంటి కామెంట్లను మేము చేసి ఉండాల్సింది కాదు.. ఢిల్లీ ఓటమిపై అమిత్ షా

  • బీజేపీ లీడర్లు చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఎఫెక్ట్ పడింది
  • ఢిల్లీ ఎలక్షన్ ను ‘ఇండో-పాక్’ మ్యాచ్ అనాల్సింది కాదు
  • ఈ ఫలితాలకు సీఏఏ, ఎన్నార్సీకి సంబంధం లేదని వ్యాఖ్య
కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీ గెలుపుపై ప్రభావం పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ నేతలు ‘గోలీ మారో’, ‘ఈ ఎలక్షన్ ఇండియా- పాకిస్థాన్’ మ్యాచ్ వంటి కామెంట్లు చేసి ఉండాల్సింది కాదని చెప్పారు. అలాంటి వ్యాఖ్యలకు తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని పేర్కొన్నారు. ఢిల్లీ ఎలక్షన్లలో ఆప్ ఘన విజయం, బీజేపీ ఓటమి తర్వాత ఆయన తొలిసారిగా గురువారం ఈ విషయంపై మాట్లాడారు.

మా అంచనాలు తప్పాయి

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి తమ అంచనాలు తప్పాయని అమిత్ షా చెప్పారు. బీజేపీకి 45 సీట్లు వస్తాయని భావించామన్నారు. సీఏఏ, ఎన్నార్సీ అంశాలకు ఢిల్లీ ఎన్నికలకు సంబంధం లేదని, ఈ రిజల్ట్స్ వాటిపై రెఫరెండమేమీ కాదని పేర్కొన్నారు. తాము గెలుపు కోసమో, ఓటమి కోసమో ఎన్నికల్లో పోటీ చేయలేదని.. తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఢిల్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తామని తెలిపారు.


More Telugu News