ఏపీ శాసనసభ కార్యదర్శిపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం?

  • సెలెక్ట్ కమిటీల ఏర్పాటు కుదరదన్న కార్యదర్శి
  • సంబంధిత దస్త్రాన్ని తిప్పి పంపిన వైనం
  • సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి తనకు నివేదించాలని షరీఫ్ తిరిగి ఆదేశాలు  
ఏపీకి సంబంధించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు రద్దుకు సంబంధించి ఇప్పటికే సెలెక్ట్ కమిటీలకు సభ్యులను శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఈ కమిటీల ఏర్పాటు కుదరదంటూ సంబంధిత దస్త్రాన్ని శాసనసభ కార్యదర్శి తిప్పి పంపడంపై షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

వెంటనే సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి తనకు నివేదించాలని శాసన కార్యదర్శికి షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు సంబంధిత వర్గాల సమాచారం.ఈ విషయమై ఇంకా జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని కార్యదర్శిని షరీఫ్ హెచ్చరించారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, శాసనసభ కార్యదర్శిని వైసీపీ బెదిరిస్తోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఇదేసమయంలో ఆ ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు.


More Telugu News