మరి మీ ‘బళ్లారి గ్యాంగ్’ సంగతేంటి?: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్
- కేసులున్నోళ్లకు టికెట్లు ఎందుకిచ్చారో చెప్పాలని సుప్రీంకోర్టు చెప్పింది
- ఆ వెంటనే మీరు కర్ణాటకలో కేసులున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు
- సుప్రీంకోర్టు ఆదేశాలను అవహేళన చేశారని విమర్శ
అటవీ, మైనింగ్ కు సంబంధించి అవినీతి ఆరోపణలున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కు అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. క్రిమినల్ కేసులున్న వారికి టికెట్లు ఎందుకిచ్చారో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అదే సమయంలో బీజేపీ సర్కారు ఇలా చేయడం కోర్టును అవహేళన చేయడమేనని ఆరోపించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రధాని నరేంద్ర మోదీ చింపేశారని విమర్శించింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ రణదీప్ సింగ్ సుర్జేవాలా వరుసగా ట్వీట్లు చేశారు.