రెండో పెళ్లి చేసుకోబోతున్న నిర్మాత దిల్ రాజు?
- 30 ఏళ్ల యువతితో దిల్ రాజు వివాహం
- మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య మృతి
- భార్య మరణంతో కుంగిపోయిన దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ... వీటిని ఇంత వరకు ఎవరూ ఖండించలేదు. అయితే ఆయన రెండో పెళ్లికి సంబంధించి ఈరోజు మరో అప్ డేట్ వచ్చింది.
ఈ నెల 15న పెళ్లి జరగబోతోందనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. దిల్ రాజు చేసుకోబోయే అమ్మాయి ఆయనకు చాలా కాలంగా తెలుసని చెబుతున్నారు. గతంలో ఆమె ఎయిర్ హోస్టెస్ గా పని చేసిందని, చాలా కాలంగా ఇద్దరూ స్నేహితులని చెబుతున్నారు. దిల్ రాజు వయసు 50లలో ఉండగా... పెళ్లి కూతురు వయసు 30 ఏళ్లని అంటున్నారు.
మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య కారణాలతో చనిపోయారు. కొన్నాళ్ల పాటు ఆ షాక్ నుంచి ఆయన బయటకు రాలేకపోయారు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కూతురుకి కూడా ఆయన పెళ్లి చేసేశారు. దీంతో, ఆయన ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన రెండో వివాహానికి కూతురు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తేలాల్సి ఉంది.