తప్పుడు వార్తలు రాసిన వారిపై పరువు నష్టం దావా: ఐటీ సోదాలపై టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి స్పందన

  • వ్యాపార లావాదేవీలపై ఐటీ శాఖ సోదాలు సర్వసాధారణం
  • వైసీపీ అనుకూల మీడియా నా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించింది
  • రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా 
  • సాక్షి దినపత్రిక బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు న్యాయ పోరాటం 
తన నివాసంలో ఆదాయపన్ను శాఖ సోదాలపై కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వ్యాపార లావాదేవీలపై ఐటీ శాఖ సోదాలు సర్వసాధారణమని చెప్పుకొచ్చారు. నిర్మాణ రంగంలో తన సంస్థ చాలా ప్రాంతాల్లో పని చేస్తోందని చెప్పారు.

వైసీపీ అనుకూల మీడియా తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించిందని శ్రీనివాసుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నానని వివరించారు. సాక్షి దినపత్రిక బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. కాగా, ద్వారకానగర్‌లోని ఆయన నివాసంలో ఇటీవల ఐటీ సోదాలు జరిగాయి.


More Telugu News