130 కోట్ల మందిలో కోటిన్నర మందే ట్యాక్స్ కడుతున్నారు.. నిజాయతీగా ట్యాక్స్ కట్టాలి: మోదీ
- ట్యాక్స్ లను గౌరవించే దేశంగా ఇండియాను మారుద్దాం
- నాలుగైదేళ్లుగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది
- పెద్ద టార్గెట్ పెట్టుకుని సాధించేందుకు ప్రయత్నించడం మంచిదని వెల్లడి
దేశంలో 130 కోట్ల మందికిపైగా జనాభా ఉంటే అందులో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపు పన్ను కడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలంతా నిజాయతీగా పన్నులు కడతామని వాగ్దానం చేయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్ నవ్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు.
‘‘2022లో మనం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకుందాం. ఇండియాను సరిగ్గా పన్నులు కట్టే, గౌరవించే దేశం (ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఆ దిశగా చాలా వర్క్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది’’ అని మోదీ చెప్పారు.