సొంత చెల్లి ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని చెప్పింది: జగన్‌పై బుద్ధా వెంకన్న విమర్శలు
- బాబాయ్ హత్య వెనుక ఉన్న కుట్ర ఏంటి?
- సీబీఐ విచారణ కోరిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు?
- సొంత చెల్లి కోర్టు మెట్లు ఎక్కడం వెనుక ఉన్న మర్మం ఏంటి?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. 'బాబాయ్‌ని చంపింది ఎవరు? ఎన్నికల ముందు సీబీఐ విచారణ కోరిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? సొంత చెల్లి ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ కోర్టు మెట్లు ఎక్కడం వెనుక ఉన్న మర్మం ఏంటి?' అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
'7 రోజుల్లో కేసులు ఛేదించే దమ్మున్న ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటున్న వారు సొంత బాబాయ్ హత్యకేసుని 9 నెలలు అయినా ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇంతకీ బాబాయ్ ని చంపింది ఎవరు? బాబాయ్ హత్య వెనుక ఉన్న కుట్ర ఏంటి? హూ కిల్డ్ బాబాయ్? రాష్ట్రాన్ని వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు?' అని ట్వీట్ చేశారు.
'జగన్ గారు మూడో కన్ను తెరిస్తే అందరూ భస్మం అయిపోతారు అని మంత్రి గారు అంటే ఆయనలో అంత దరిద్రం తాండవిస్తోందా? అని ముందు నమ్మలేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత మంత్రి గారు చెప్పింది నిజమే అని తేలింది' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
'కేంద్ర పెద్దల చుట్టూ విజయసాయిరెడ్డి గారు చక్కర్లు కొట్టడం, జగన్ గారు కేసుల మాఫీ కోసం కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని వారి చుట్టూ బొంగరంలా తిరగడంతో మీ దరిద్రం ఢిల్లీ పెద్దలకు కూడా అంటుకున్నట్టు ఉంది' అని అన్నారు.
'చంద్రబాబు గారు చెయ్యి వేసిన వాళ్లు అందరూ భారీ మెజారిటీతో గెలవడం, జగన్‌కు దగ్గర అవ్వాలని కాళ్లు పట్టుకున్న వారు దెబ్బతినడంతో మీకు చిన్న మెదడు చితకడం సాధారణంగా జరిగే చర్యే విజయసాయి రెడ్డి గారు' అని అన్నారు. కాగా, తన తండ్రి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.