'కొట్టకమ్మా' అని చేతులెత్తి దండం పెట్టినప్పటికీ.. అత్తను కర్రతో కొట్టి, ఈడ్చుకెళ్లిన కోడలు.. వీడియో వైరల్‌

  • ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో ఘటన
  • వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి
  • కోడలు అరెస్టు.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
అత్తను కర్రతో కొట్టడానికి కోడలు దూసుకొచ్చింది.. కింద కూర్చున్న అత్త 'కొట్టకమ్మా' అంటూ చేతులెత్తి దండం పెట్టింది. అయినప్పటికీ ఆమెను ఆ కోడలు కర్రతో కొట్టింది. అంతేకాదు, ఉదయాన్నే చలికి తట్టుకోలేకపోతోన్న అత్తపై ఆ కోడలు నీళ్లు పోసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హృదయవిదారక దృశ్యాన్ని ఆ ఇంటి పక్క నుండే వారు తమ స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.  

'మేము ఈ వీడియోను చూసి ఆ కోడలిని అరెస్టు చేశాం. సీనియర్ సిటిజన్స్‌ యాక్ట్‌తో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశాము' అని ఎటా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.


More Telugu News