జగన్ దేశానికే నష్టం కలిగిస్తుంటే మోదీ మందలించక దండ వేసి దన్నం పెడతారా?: బుద్ధా వెంకన్న

  • జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు ఫినాయిల్
  • రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి పోతోంది
  • 'జగ్లక్' పాలనలో రాష్ట్రం వెలిగిపోతోందంటూ వార్తలు రాయించుకున్నారు
'బాబు సీఎంగా లేని ఆంధ్ర రాష్ట్రం నాశనమై పోవాలని కిరసనాయిలు కోరుకుంటున్నాడు. సీఎం జగన్ గారు రాష్ట్ర సమస్యల గురించి గంటన్నర సేపు ప్రధాని మోదీ గారితో సమావేశమైతే మందలించాడని రాశారు' అంటూ ఓ మీడియా అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు ఫినాయిల్. జగన్ గారి చెత్త ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి పోతున్నా 9 నెలల జగ్లక్ పాలనలో రాష్ట్రం వెలిగిపోతుంది అంటూ బ్లాక్ పేపర్ లో వార్తలు రాయించుకొని సంబరపడుతున్నారు' అని విమర్శించారు.

'తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికే కాక దేశానికే నష్టం కలిగిస్తుంటే ప్రధాని మందలించక దండ వేసి దన్నం పెడతారా ఫినాయిల్ గారు? 9 నెలల్లో ఏమి సాధించారని 'మోదీ గారు ప్రశంసలతో ముంచెత్తారు' అని మీ బ్లాక్ పేపర్ లో రాయించారు? సిగ్గుగా లేదా??' అని ప్రశ్నించారు.


More Telugu News