విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసల జల్లు
- రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో క్రియాశీల పాత్ర పోషించారు
- ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు
- మొత్తం 9 సందర్భాల్లో మాట్లాడిన వైసీపీ ఎంపీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసలు కురిపించింది. రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడింది. ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడంలో రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా ఆయన అవకాశాలను చాలా బాగా వినియోగించుకున్నారని పేర్కొంది.
రాజ్యసభలో విజయసాయిరెడ్డి 9 సందర్భాల్లో తన గళాన్ని వినిపించారని.. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, వాటికి నాలుగు అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడినట్టు తెలిపింది. వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతోపాటు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేశారని వైసీపీ ఎంపీని కొనియాడింది.