ప్రధాని మోదీ భద్రతకు రోజుకు రూ. 1.62 కోట్లు.. లోక్‌సభకు తెలిపిన కిషన్‌రెడ్డి

  • డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కిషన్‌రెడ్డి లిఖిత పూర్వక సమాధానం
  • దేశంలో ఒకే ఒక్క వ్యక్తికి ఎస్పీజీ భద్రత
  • గతేడాది నవంబరులో గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
ప్రధాని నరేంద్రమోదీ భద్రతకు రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభకు తెలిపారు. దేశంలో ఎంతమంది ప్రముఖులకు ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నారన్న డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీజీ భద్రత పొందుతున్నారంటూ పరోక్షంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించిన మంత్రి.. ఇందుకోసం రోజుకు దాదాపు 1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.

ఇక మొత్తంగా 56 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. మొత్తం 3 వేలమంది ప్రత్యేక కమాండోలున్న ఎస్పీజీకి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.592.55 కోట్లు కేటాయించారు. గతంలో ఇది రూ.540 కోట్లు కాగా, ఈసారి దానికి పదిశాతం పెంచారు. నిన్నమొన్నటి వరకు ప్రధానితోపాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండగా, గతేడాది నవంబరులో కేంద్రం దానిని ఉపసంహరించింది.


More Telugu News