మోదీతో జగన్ భేటీపై వర్ల రామయ్య విమర్శలు
- వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారు
- మోదీతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలి
- కేంద్ర విద్యా సంస్థలు, రైల్వేజోన్ అంశాల గురించి ప్రస్తావించారా?
ఢిల్లీలో ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్ ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. మోదీతో జగన్ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు, ఏపీ శాసనమండలి రద్దు, మూడు రాజధానుల అంశాల గురించి మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని నాడు ఎన్నికల ప్రచార సమయంలో జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ఈ సందర్భంగా వర్ల ప్రశ్నించారు. కేంద్ర విద్యా సంస్థలు, రైల్వేజోన్, కాపుల రిజర్వేషన్ అంశాల గురించి ఈ భేటీలో ప్రస్తావించారా? అని ప్రశ్నించారు.