యూపీ మాజీ సీఎం మాయావతి నివాసానికి కరెంట్ కట్

  • బిల్లులు కట్టకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేత
  • పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు
  • బిల్లులు చెల్లించడంతో సరఫరా పునరుద్ధరణ
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతికి  విద్యుత్ శాఖ అధికారులు ఈ రోజు షాకిచ్చారు. విద్యుత్ బిల్లులు చెల్లించనందుకు గ్రేటర్ నొయిడాలోని ఆమె నివాసానికి కరెంట్ సరఫరాను కట్ చేశారు. మాయావతి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.67 వేల వరకు పేరుకుపోయాయని అధికారులు చెబుతున్నారు.

ఆమె ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేయడంపై ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అధికారులు వెల్లడించారు. కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించనివారికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం సాధారణమేనని వారు చెప్పారు. ఇదిలావుండగా, కరెంట్ కట్ బాధలను తప్పించుకోవడానికి మాయావతి కుటుంబ సభ్యులు దిగివచ్చి యాబైవేల రూపాయలు బిల్లు కట్టడంతో అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.


More Telugu News