ఈ నెల 17న 'వి' మూవీ టీజర్
- ఇంద్రగంటి నుంచి విభిన్న కథాచిత్రం
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు
- సీరియల్ కిల్లర్ గా కనిపించనున్న నాని
మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'వి' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 'ఉగాది' పండుగ సందర్భంగా మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. ఆయన పాత్రను కూడా 'రాక్షసుడు' అంటూనే పరిచయం చేశారు. ఆ పాత్రను టీజర్ లో రివీల్ చేస్తారనే ఆసక్తితో అభిమానులంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను సుధీర్ బాబు పోషించాడు. 'రక్షకుడు' అంటూ అయన పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాయికలుగా నివేదా థామస్ - అదితీరావు హైదరీ కనిపించనున్నారు.