విదేశీ కరెన్సీ అక్రమ తరలింపుకు వినూత్న యత్నం: దొరికిపోయిన ప్రయాణికుడు

  • ఢిల్లీ నుంచి దుబాయ్ తరలించే ప్రయత్నం
  • విదేశీ కరెన్సీలో 2 లక్షల వరకు సౌదీ రియాల్
  • 1500 ఖతర్ రియాల్, 1200 కువైట్ దీనార్, 1800 యూరోలు..
విమానాల్లో ప్రయాణిస్తూ అక్రమంగా బంగారం దేశంలోకి తీసుకురావడానికి ప్రయాణికులు చేస్తోన్న ప్రయత్నాలు ఒక ఎత్తైతే.. తాజాగా విదేశీ కరెన్సీని విదేశాలకు తరలించడానికి ఓ ప్రయాణికుడు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. విదేశీ కరెన్సీని వేరుశనక్కాయల్లో పెట్టి ఢిల్లీ నుంచి  దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైన మురాద్ అలం అనే వ్యక్తిని విమానాశ్రయ భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు.

వేరుశనక్కాయల పొట్టును ఒలిచి అందులోంచి పల్లీలను తీసి వాటి స్థానాల్లో మడతపెట్టిన విదేశీ నోట్లను పెట్టాడు. అయితే.. సదరు ప్రయాణికుడి ప్రయత్నాన్ని భద్రతా సిబ్బంది విఫలం చేశారు. అక్రమంగా తరలిస్తున్న కరెన్సీల్లో 2 లక్షలకు పైగా సౌదీ రియాల్, 1500 ఖతర్ రియాల్, 1200 కువైట్ దినార్, 300 ఒమన్ రియాల్, 1800 యూరోలున్నాయి. వీటిని తరలించడానికి వేరుశనక్కాయలతో పాటు, బిస్కెట్లు తదితర తినుబండారాలను ఉపయోగించాడని పోలీసులు వెల్లడించారు.


More Telugu News