కేరళ రోజు కూలీకి రూ.12 కోట్ల లాటరీ
- కేరళ ప్రభుత్వ లాటరీలో జాక్ పాట్
- ముందు అప్పులన్నీ కట్టేస్తానన్న విన్నర్ రాజన్
- తోటివారికి సాయం చేస్తానని వెల్లడి
కేరళకు చెందిన రోజు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. కేరళ సర్కారు నిర్వహించే న్యూఇయర్-క్రిస్ మస్ లాటరీకి సంబంధించి ఫిబ్రవరి 10 డ్రా తీయగా.. మలూర్ గిరిజన ప్రాంతంలోని తొలంబ్రకు చెందిన పెరున్నాన్ రాజన్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతి మొత్తం రూ.12 కోట్లు అయినా.. అందులో 30 శాతం ట్యాక్స్, ఆ టికెట్ అమ్మినవారికి ఇచ్చే పర్సంటేజీ పోను రాజన్ కు ఏడు కోట్ల 20 లక్షల వరకు అందుతాయని లాటరీ నిర్వాహకులు తెలిపారు.
రాజన్ కు భార్య రజని, ఇద్దరు కుమార్తెలు అక్షర, అథిర, కుమారుడు రిగిల్ ఉన్నారు.
అప్పులన్నీ కట్టేస్తా.. తోటివారికి సాయం చేస్తా..
ఇంత భారీ లాటరీ గెలుచుకున్నానన్న విషయాన్ని ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఇదంతా కలలా ఉందని రాజన్ అన్నారు. తనకు ఎంతో కొంత అయినా వస్తుందని భావించానని, కానీ కోట్ల రూపాయలు వస్తాయని అనుకోలేదని చెప్పారు. లాటరీ సొమ్ము రాగానే ముందు అప్పులన్నీ కట్టేస్తానని చెప్పారు. తన తోటివారు, చుట్టూ ఉన్నవారు ఎన్నో బాధల్లో ఉన్నారని, అలాంటి వారికి అవసరమైన సాయం చేస్తానని.. ఎట్టి పరిస్థితుల్లో వృథా మాత్రం చేయనని తెలిపారు.రాజన్ కు భార్య రజని, ఇద్దరు కుమార్తెలు అక్షర, అథిర, కుమారుడు రిగిల్ ఉన్నారు.