అందుకే, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు: లక్ష్మీపార్వతి
- రాష్ట్రంలో అనేక మాండలికాలు ఉన్నాయి
- ఒక ప్రాంతం మాండలికం మరొక ప్రాంతం వాళ్లకు అర్థం కాదు
- తెలుగు భాషను నిజంగా ప్రేమించింది జగనే
రాష్ట్రంలో అనేక మాండలికాలు ఉన్నాయని, ఒక ప్రాంతం మాండలికం మరొక ప్రాంతం వాళ్లకు అర్థం కాదని, అందుకే, ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. పుస్తకాలలో ఉండే భాష కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినదని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు భాషను నిజంగా ప్రేమించింది జగనే అని వ్యాఖ్యానించిన ఆమె, చంద్రబాబు, లోకేశ్ లకు ‘తెలుగు’, ‘ఇంగ్లీషు’ ఈ రెండూ రావని విమర్శించారు. మంచి విషయాలను అడ్డుకునే చంద్రబాబు చరిత్ర ముగిసిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.