కరోనా ఎఫెక్ట్.. పుట్టినరోజు చేసుకుంటానంటే జైల్లో పెట్టారు
- వైరస్ భయంతో పార్టీలపై నిషేధం విధించిన చైనా
- అనుమతివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న వృద్ధుడు
- ఒంటికి టపాసులు చుట్టుకుని, పెట్రోల్ పోసుకుని బెదిరింపు
- అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టిన పోలీసులు
చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుట్టినరోజు వేడుకలపైనా పడింది. ఓ 59 ఏళ్ల
వృద్ధుడు తన పుట్టినరోజు చేసుకుంటానంటే.. అధికారులు ఒప్పుకోలేదు. దాంతో టపాసులు ఒంటికి చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆ వృద్ధుడు బెదిరించాడు. దీనిపై మండిపడ్డ పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపారు. చైనాలోని చోంగ్ కింగ్ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది.