ఆగిపోయిన 'శీనయ్య' సినిమా?

  • వినాయక్ హీరోగా 'శీనయ్య'
  • తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి 
  • అవుట్ పుట్ పట్ల వినాయక్ అసంతృప్తి  
వినాయక్ దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వినాయక్ 'శీనయ్య' సినిమాతో నటుడిగా మారాడు. 'దిల్' రాజు నిర్మాణంలో .. 'శరభ' ఫేమ్ నరసింహా దర్శకత్వంలో 'శీనయ్య' సినిమా చేయడానికి వినాయక్ అంగీకరించాడు. పాత్ర పరంగా కాస్త సన్నగా కనిపించడంకోసం గట్టిగానే కసరత్తులు చేశాడు.

ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రషెస్ చూసిన తరువాత వినాయక్ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఈ ప్రాజెక్టును ఇక్కడితో ఆపడమే మంచిదని చెప్పాడట. అందుకు 'దిల్' రాజు అంగీకరించడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే మాట బలంగానే వినిపిస్తోంది. ఇక వినాయక్ దర్శకుడిగా తదుపరి సినిమాపై దృష్టి పెడతాడేమో.


More Telugu News