పవన్ కల్యాణ్ చేతిపై జగన్ టాటూ.. మండిపడుతున్న అభిమానులు!
- పవన్ ఫొటోను మార్ఫింగ్ చేసిన వ్యతిరేకులు
- జనసేన ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
జనసేనాని పవన్ కల్యాణ్ తన చేతిపై ఏపీ సీఎం టాటూను వేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ మార్ఫింగ్ ఫొటోను కొందరు వదిలారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు.
ఇటీవల కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ ఫొటోను కొందరు మార్ఫింగ్ చేశారు. ఎలాంటి టాటూ లేని పవన్ చేతిపై జగన్ ఫొటోను ఉంచారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, జనసేన ట్విట్టర్ అకౌంట్ కు కూడా ట్యాగ్ చేశారు. ఈ మార్ఫింగ్ ఫొటోపై జనసేన అభిమానులు మండిపడుతున్నారు.