ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోంది: సెలెక్ట్‌ కమిటీలపై యనమల

  • కార్యదర్శిది సభాహక్కుల ఉల్లంఘనే
  • మండలి చైర్మన్‌ ఆదేశాలు ఆయన పాటించాలి
  • లేదంటే సస్పెండ్‌ చేసే హక్కు మండలికి ఉంది
ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదనలను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న శాసన మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని శాసన మండలిలో విపక్ష నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అయితే మండలి తీర్మానానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం ఎవరికీ లేదని, చైర్మన్‌ ఆదేశాలను పాటించకుంటే కార్యదర్శి బాధ్యుడవుతారని హెచ్చరించారు. మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడం, ధిక్కరించడం అధికారుల వల్ల కాదని స్పష్టం చేశారు. అలా వెళ్లేవారెవరైనా సభ తీసుకునే నిర్ణయానికి బాధ్యులవుతారని తెలిపారు.



More Telugu News